Telugu Sandhulu With Examples తెలుగు సంధులు సూత్రము

Telugu Sandhulu With Examples తెలుగు సంధులు సూత్రము: In the Telugu vyakaranam ‘సంధులు’ place an important role that deals with the division and the formation of words. Here we are discussing with some type of basic ‘Sandhulu’ that are used with few examples.

Learning the language is a mandatory task for all individuals. In the states of Telangana, Andhra Pradesh, and Yanam the Telugu language is used for speaking, reading, and writing. When starting the mother language continues with the alphabet, one-letter words, two-letter words, many words, sentences, and then Telugu grammar.

సంధులు (What is Sandhi ? Formation of  Sandhulu

వ్యాకరణ పరిభాషలో రెండు అచ్చుల కలయికను ‘సంధి’ అంటారు. ఆ రెండు అచ్చుల మధ్య జరిగే మార్పును ‘సంధి కార్యం’ అంటారు. సంధిలో రెండు పదాలు ఉంటాయి. వాటిలో మొదటి పదంలోని చివరి స్వరాన్ని “పూర్వస్వరం” అని, రెండవ పదంలోని మొదటి అక్షరాని “పరస్వరం” అని అంటరు.

ఉదా: విశ్వద + అభిరామ

పూర్వస్వరం = ద్ + అ

పరస్వరం = అ

విశ్వదాభిరామ

దా – ఆ – ‘సంధి కార్యం

Types of “Sandhulu”:

సవర్ణదీర్ఘ సంధి, గుణ సంధి, యడాగమ సంధి, రుగాగమ సంధి, టుగాగమ సంధి, ఆమ్రేడిత సంధి, ద్విరుక్తటకార సంధి, అత్వ సంధి, ఇత్వ సంధి, ఉత్వ సంధి మొదలగునవి కొన్ని సంధుల పేర్లు.

సవర్ణదీర్ఘ సంధి:

  • అ, ఇ, ఉ, ఋ అనె వర్ణాలకు అవే వర్ణాలు కలిసినప్పుడు దీర్ఘం ఆదేశమగ వచ్చును
  • ‘ఆ వర్ణానికి అ – ఆ లు సవర్ణాలు
  • ‘ఇ వర్ణానికి ఇ – ఈ లు సవర్ణాలు
  • ‘ఊ వర్ణానికి ఉ – ఊ లు సవర్ణాలు
  • ‘ఋ’ వర్ణానికి ఋ – ౠ లు సవర్ణాలు

ఉదా: 1. రామానుజుడు = రామ + అనుజుడు

  1. కవీశ్వరుడు = కవి + ఈశ్వరుడు
  2. భానూదయం = భాను + ఉదయం

గుణ సంధి: 

అకారమునకు ఇ, ఉ, ఋ లు పరమైనప్పుడు క్రమముగా ఏ, ఓ, ఆర్ లు ఆదేశమగ వచ్చును. ఆర్ లను గుణాలు అంటారు. ఇలా గుణాలు వచ్చే సంధి కాబట్టి గుణ సంధి అంటారు.

ఉదా: 1. రాజేంద్రుడు = రాజ + ఇంద్రుడు (అ + ఇ = ఏ)

  1. పరోపకారం = పర + ఉపకారం (అ + ఉ = ఓ)
  2. మహర్షి = మహ + ఋషి (అ + ఋ = ఆర్)

యడాగమ సంధి:

రెండు అచ్చుల మధ్య సంధి జరిగినప్పుడు వాటి మధ్య ‘య్’ ఆదేశమగ వస్తే దానినే యడాగమ సంధి అంటారు.

ఉదా: 1. మాయమ్మ = మా + అమ్మ

  1. మీయిల్లు = మీ + ఇల్లు
  2. అమ్మయేది = అమ్మ + ఏది

రుగాగమ సంధి:

రెండు అచ్చుల మధ్య సంధి జరిగినప్పుడు వాటి మధ్య ‘ర్’ ఆదేశమగ వస్తే దానినే రుగాగమ సంధి అంటారు.

ఉదా: 1. పేదరాలు = పేద + ఆలు

  1. ధనవంతురాలు = ధనవంతు + ఆలు

టుగాగమ సంధి:

రెండు అచ్చుల మధ్య సంధి జరిగినప్పుడు వాటి మధ్య ‘ట్’ ఆదేశమగ వస్తే దానినే టుగాగమ సంధి అంటారు.

ఉదా: 1. చిగురుటాకు = చిగురు + ఆకు

  1. పండుటాకు = పండు + ఆకు

ఆమ్రేడిత సంధి:

అచ్చునకు ఆమ్రేడితం పరమైతే సంధి తరచుగా వస్తుంది. మొదట పలికిన పదాన్నే తిరిగి రెండో మారు పలుకుతం. అల రెండో మారు పలుకే పదాన్ని ఆమ్రెడితం అంటారు.

ఉదా: 1. ఔరౌర = ఔర + ఔర

  1. ఏమేమి = ఏమి + ఏమి
  2. ఎట్లెట్లు = ఎట్లు+ ఎట్లు

ఆమ్రేడిత సంధి కొన్ని సమయలలొ వికల్పంగా జరుగుతుంది. సంధి జరిగిన రూపం. సంధి జరగని రూపం.

  1. ఏమేమి, ఏమియేమి = ఏమి + ఏమి
  2. ఎట్లెట్లు, ఎట్లుయెట్లు = ఎట్లు+ ఎట్లు
  3. ఎంతెంత, ఎంతయెంత = ఎంత + ఎంత

ద్విరుక్తటకార సంధి:

కుఱు, చిఱు, కడు, నడు, నిదు శబ్ధములలో ‘ఱ, డ’ లకు అచ్చు పరమైనప్పుడు సంధి ఆదేశమగ వచ్చును.

ఉదా: 1. కుట్టుసురు = కుఱు + ఉసురు

  1. చిట్టెలుక = చిఱు + ఎలుక
  2. నట్టిల్లు = నడు+ ఇల్లు

అత్వ సంధి:

పూర్వస్వరం ‘ఆ అయినప్పుడు, పరస్వరంలొ ఉన్న అచ్చుతో కలిసి పరస్వరం మత్రమె కనిపిస్తుంది.

ఉదా: 1. లేకేమి = లేక + ఏమి

  1. ఒకప్పుడు = ఒక + అప్పుడు
  2. పొవుటెట్లు = పొవుట+ ఎట్లు

ఇత్వ సంధి:

హ్రస్వ ‘ఇ ‘ కారానికి ‘అచ్చు’ కలిసినప్పుడు సంధి జరుగుతుంది. దీన్నే ‘ఇత్వ సంధి’ అంటారు.అది తప్పక జరగాలని నియమం లేదు. జరగవచ్చు, జరగకపోవచ్చు. వ్యకరణంలొ ఈ పరిస్థితిని ‘వైకల్పికం’ అంటారు.

ఉదా: ఏమియంటివి = ఏమి + య్ + అంటివి (సంధి జరగలేదు)

ఏమియంటివి = ఏమి + అంటివి (సంధి జరిగింది)

  1. వచ్చిరిపుడు = వచ్చిరి + య్ + ఇపుడు (సంధి జరగలేదు)

వచ్చిరిపుడు = వచ్చిరి + ఇపుడు (సంధి జరిగింది)

ఉత్వ సంధి:

హ్రస్వ ‘ఉ ‘ కారానికి ‘ఉత్తుకు ‘ అచ్చు కలిసినప్పుడు ఉక్కరం లొపించి పరస్పరం కనిపిస్తుంది. దీన్నే ‘ఉత్వ సంధి’ అంటారు.ఉత్తునకు అచ్చు పరమైనప్పుడు సంధి జరుగుతుంది.

ఉదా: 1. రాముడతడు = రాముడు + అతడు

  1. గోపురమట = గొపురము+ అట
  2. లంచములుఇచ్చిరి = లంచములు + ఇచ్చిరి

వ్రుద్ధి సంధి:

‘అ’ కారనికి ఎ, ఐ లు పరమైనప్పుడు క్రమముగా ‘ఐ’ కారము, ఒ, ఔ లు లు పరమైనప్పుడు ‘ఔ’ఏకాదేసమగును. ‘ఐ, ఔ ‘ లను వ్రుద్ధులు అని అంటారు. వితితొ ఎర్పదె సంధిని ‘వ్రుద్ధి సంధీ గా పిలుస్తారు.

ఉదా: 1. సమైక్య= సమ + ఐక్య

  1. అఖండైశ్వర్యం = అఖండ + ఐశ్వర్యం
  2. పరమౌషదం= పరమ + ఔషదం

The usage of “Sandhulu” is explained easily. The users who had doubts can clarify by having a look at our page website www.swachhvidyalaya.com. For various topics related to different areas, the users can be subscribed to us to attain useful information.

Leave a Comment