Samasalu in Telugu Grammar with Examples తెలుగు సమాసాలు

Samasalu in Telugu Grammar with Examples (తెలుగు సమాసాలు)  : Telugu is a language that is used in the states of Andhra Pradesh, Telangana and Yanam. The combination of two words is called a ‘Samasam’. Learning the topic ‘Samasalu’ is a must in ‘Telugu grammar. To learn a language any person should start learning from the alphabet, words, sentences, paragraphs, daily usage terms, grammar, etc. Mother language plays an important role in an individual’s life. One has to be updated with the language as a part of communication.  Some of these “Samasalu” depends on the list of Vibakthulu’ that is mentioned below.

సమాసం:

వేరు వేరు అర్ధాలు గల రెండు పదాలు కలిసి ఒక పదంగా ఏర్పడితే దాన్నే సమాసం అంటారు. అర్ధవంతమైన రెండు పదాలు కలిసి కొత్త పదం ఏర్పడడాన్ని సమాసం అంటారు.

ఉదా :
‘అన్నదమ్ములు’ అనే సమాసంలో, ‘అన్న’ అనేది పూర్వ పదం. ‘తమ్ముడు’ అనేది ఉత్తర పదం.

అన్న + తమ్ముడు =  అన్నదమ్ములు

సమాసంలో మొదటి పదాన్ని పూర్వపదం అని, రెండవ పదాన్ని ఉత్తరపదం అని అంటారు.

Samasalu in Telugu Grammar

Samasalu in Telugu Grammar with Examples తెలుగు సమాసాలు 

In Telugu vyakaranam, samaasalu is one of the important grammar parts. They are used for comparisons and to find out the specific meaning of the combined words. Below given are the types of Samasalu along with examples.

ద్విగు సమాసం:

సంఖ్యా రూపలైన విశేషణాలు పుర్వపదంగా వుంటె దాన్నే ద్విగు సమాసం అంటారు.

ఉదా: 1. ముల్లోకాలు = మూడైన లొకలు

  1. నవరత్నాలు = నవ సంఖ్య గల రత్నాలు
  2. ఇరుమారు = రెండు మారులు
  3. ముమ్మారు = మూడు మారులు

ద్వంద్వ సమాసం:

సమాసంలోని రెండు పదాల అర్ధానికీ ప్రాధాన్యం ఉంటే దాన్నే ద్వంద్వ సమాసం అంటారు.

ఉదా: 1. భార్యాభర్తలు = భార్యయును, భర్తయును

  1. రామలక్ష్మణులు = రాముడూ, లక్ష్మణుడూ
  2. తల్లిదండ్రులు = తల్లియును, తండ్రియును
  3. అన్నదమ్ములు = అన్నయును, తమ్ముడును

బహువ్రిహి సమాసం:

అన్యపదార్ధ ప్రధానమైన దాన్ని బహువ్రిహి సమాసం అంటారు.

ఉదా: 1. పితాంబరుడు = పితాంబరాలను ధరించువాడు

  1. పద్మనాభుడు = పద్మం నాభియందు కలవాడు
  2. వికలాంగులు = వికలములైన అంగములు కలవారు
  3. రాజీవాక్షుడు = రాజీవములు వంటి అక్షులు కలవారు

తత్పురుష సమాసం:

సమాసం లోని రెండవ పదం యొక్క అర్ధం ప్రధానంగా కలది.

ఉదా: 1. అర్ధరాజ్యం- రాజ్యము యొక్క అర్ధం – ప్రధమా తత్పురుష సమాసం

  1. విద్యర్ధులు = విద్యను అర్ధించువారు – ద్వితీయ తత్పురుష సమాసం
  2. దెవరమేలు = దెవర కొరకు మీలు – చతుర్ధి తత్పురుష సమాసం
  3. దొంగభయం – దొంగ వలన భయం – పంచమీ తత్పురుష సమాసం

విభక్తులు:

  • విభక్తులను ఆధారంగ చెసి కొన్ని సమాసాలు చెప్పబడతాయి.
  • డు, ము, వు, లు – ప్రధమా విభక్తి
  • నిన్, నున్, లన్, కూర్చి, గురించి – ద్వితీయా విభక్తి
  • చెతన్, చెన్, తోడన్, తోన్ – త్రుతీయ విభక్తి
  • కొఱకున్, కై – చతుర్ధీ విభక్తి
  • వలనన్, కంటెన్, పట్టి -పంచమీ విభక్తి
  • కిన్, కున్, యొక్క, లోన్, లోపలన్ – షష్టీ విభక్తి
  • అందున్, ఇందున్, నన్ – సప్తమీ విభక్తి
  • ఒ, ఓయి, ఓరి, ఓసి – సంబోధన ప్రధమా విభక్తి

కర్మధారయ సమాసం:

దీనికే సమానాధికరణం అని పేరు. విశేషణానికి నామవాచకంతోను, నామవాచకానికి విశేషణంతోను, ఉపమానానికి ఉపమేయంతోను, ఉపమేయానికి ఉపమానంతోను సమాసం చేస్తె దాన్నే కర్మధారయం అంటారు.

ఉదా: 1. ఎఱ్ఱ గులాబి = ఎర్రనైన గులాబి – విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం

  1. కపూతవ్రుద్ధం = వ్రుద్ధమైన కపొతం -విశేషణ ఉత్తరపద కర్మధారయ సమాసం
  2. శీతోష్ణం = శీతమైనది, ఉష్ణమైనది – విశేషణ ఉభయపద కర్మధారయ సమాసం
  3. తేనె పలుకులు = తేనె వంటి పలుకులు – ఉపమాన
  4.    పూర్వపద కర్మధారయ సమాసం
  5. పదాంబుజం = అంబుజం వంటి పదం – ఉపమాన ఉత్తరపద కర్మధారయ సమాసం

విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం:

విశేషణం పుర్వపదంగా ఉండే కర్మధారయ సమాసమును ” విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం” అని అంటారు.

  • పూర్వ పదం: విశేషణం (గుణం)
  • ఉత్తర పదం: నమవాచకం

ఉదా: 1. హితోక్తి = హితకరమైన ఉక్తి

  1. వెందికొండ = వెండిదైన కొండ
  2. ప్రియభాషలు= ప్రియమైన భాషలు
  3. వ్రుద్దకపొతం = వ్రుద్దమైన కపోతం

విశేషణ ఉత్తరపద కర్మధారయ సమాసం:

విశేషణం ఉత్తరపదంగా ఉండే కర్మధారయ సమాసమును ” విశేషణ ఉత్తరపద కర్మధారయ సమాసం” అని అంటారు.

  • పూర్వ పదం: నమవాచకం
  • ఉత్తర పదం: విశేషణం (గుణం)

ఉదా: 1. పురుషోత్తముడు = ఉత్తముడైన పురుషుడు

  1. వ్రుక్ష రాజము = రాజైన వ్రుక్షము
  2. కమారోత్తములు= ఉత్తములైన కుమారులు
  3. వానర శ్రేష్టుడు =శ్రేష్టుడైన వానరుడు

విశేషణ ఉభయపద కర్మధారయ సమాసం :

రెండు పదాల విశేషణములుగా కలిగిన కర్మధారయ సమాసమును “విశేషణ ఉభయపద కర్మధారయ సమాసం”అని అంటారు.

  • పూర్వ పదం: విశేషణం
  • ఉత్తర పదం: విశేషణం

ఉదా: 1. మ్రుధు మధురం = మ్రుధువైనది, మధురమైనది

  1. ధీరోధాత్తుడు = ధీరుడు, ఉదాత్తుడు
  2. సరస గంభీరము= సరసమైనది, గంభీరమైనది
  3. హ్రుద్యొదత్తము = హ్రుద్యము, ఉదాత్తము

ఉపమాన పూర్వపద కర్మధారయ సమాసం:

ఉపమానము పుర్వపదముగా ఉండే కర్మధారయ సమాసమును “ఉపమాన పూర్వపద కర్మధారయ సమాసం” అంటారు.

  • పూర్వ పదం: ఉపమానం
  • ఉత్తర పదం: ఉపమేయం

ఉదా: 1. తేనె మాట = తీనె లంటి మాట

  1. సుధా మధురం = సుధ వలె మధురం
  2. రతి సుందరి= రతి వలె సుందరి
  3. చిగురు కేలు = చిగురు లంటి కేలు

ఉపమాన ఉత్తరపద కర్మధారయ సమాసం:

ఉపమానము ఉత్తరపదముగా ఉండే కర్మధారయ సమాసమును “ఉపమాన ఉత్తరపద కర్మధారయ సమాసం” అంటారు.

పూర్వ పదం: ఉపమేయం

ఉత్తర పదం: ఉపమానం

ఉదా: 1. తనూలత = లత వంటి తనువు

  1. కనుదామరులు = తామర లాంటి కనులు
  2. పాద పద్మములు= పద్మముల వంటి పాదములు
  3. కాంతామణి= మణి వంటి కాంత

సంభావన పుర్వపద కర్మధారయ సమాసం:

‘సంభావనా పదం పుర్వ పదముగా ఉండే సమాసమును “సంభావన పుర్వపద కర్మధారయ సమాసం” అంటారు.

పూర్వ పదం: సంభావన (పేరు)

ఉత్తర పదం: నామవాచకం

ఉదా: 1. ద్వారకాపురి= ద్వారక అను పేరు గల పట్టణము

  1. గూవర్దనము = గూవర్దనమనే పేరు గల అద్రి
  2. తుమ్మచెట్టు = తుమ్మ అనే పేరు గల చెట్టు
  3. పెన్నానది= పెన్నా అనే పేరు గల నది

రూపక సమాసం:

ఉపమేయంతో ఉపమాన ధర్మాన్ని ఆరోపించడం వల్ల “రూపకం” ఏర్పడును. సంస్క్రుతంలో “ఏవ” అనెది అవధారనార్ధకం. రూపక సమాసంలోని విగ్రహవాక్యంలో సంస్క్రుతంలో పుర్వపదం పైన “ఏవ” చేరును.

ఉదా: 1. విద్యాధనం – విద్య ఏవ ధనం (లేక) విద్య అనెది ధనం

  1. దయామ్రుతం – దయ అనెది అమ్రుతం
  2. కీర్తికాయం – కీర్తి అనెడి కాయం

The aspirants who wish to learn the topic ‘Samasalu’ can go through our website www.swachhvidyalaya.com. A simple and clear explanation given can be viewed by regular users visiting the website. We hope the topics related to education are helpful to the users in learning or clarifying their doubts.

Leave a Comment